చెక్ డ్యాములను సందర్శించిన జిల్లా చైర్మన్ సురేందర్ రెడ్డి..

– రైతులకు ఉపయోగపడే చెక్ డ్యాoలను త్వరతి గతిన పూర్తి చేయాలి….. జిల్లా చైర్మన్ సురేందర్ రెడ్డి.
నవతెలంగాణ – మంథని: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మానేరు నదులపై నిర్మిస్తున్న చెక్ డ్యాములను త్వరితగతిన పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ పెద్దపల్లి జిల్లా చైర్మన్ ముస్కుల. సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంథని డివిజన్ ముత్తారం మండలం ఓడెడ్ మానేరులో నిర్మాణం మధ్యలో ఆగిన చెక్ డ్యామును ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించి వారి భూములను చేయాలని ఉద్దేశంతో ప్రభుత్వ చేపట్టిన చిట్యాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోతున్నాయని వాటిని ప్రభుత్వం వెంటనే నిర్మాణ పనులు పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.మానేరు నది పైన నిర్మాణం చేపట్టిన చెక్ డ్యాములు ఎక్కడ పూర్తికాలేదని,మంథని మండలం గోపాల్ పూర్ మానేరు నదిపై నిర్మించిన చెక్ డాం వరదల్లో కొట్టుకపోయిందని,ఓడేడ్ లో అదేవిధంగా నిర్మించిన చెక్ డ్యాం అదే పరిస్థితిలోఉందన్నారు.దీనిపై సంబంధిత ఇరిగేషన్ అధికారులు స్పందించి రైతులకు ఉపయోగపడే పనులను పూర్తి చేయాలన్నారు.ఈ ఖరీఫ్ సీజన్ లోపు చెక్ డ్యామ్ పనులు పూర్తిచేస్తే ఖరీఫ్ సీజన్ లో రైతులకు అన్ని విధాలుగా ఈ చెక్ డ్యాములు ఉపయోగా పడతాయన్నారు. జిల్లాలలో మానేరు నది పైన అసంపూర్తిగా ఉన్న చెక్ డాంలను ప్రభుత్వం వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.త్వరలో జిల్లా కిసాన్ సెల్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి మానేరు నది పైన అసంపూర్తిగా ఉన్న చెక్ డ్యాoలను సందర్శించే కార్యక్రమాన్ని చేపడతామని ఆయన తెలిపారు,ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు,రైతులు,పాల్గొన్నారు.

Spread the love