కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న వీఆర్ఏలు

– ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
– పే స్కేల్ రెగ్యులర్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన వీఆర్ఏల సంఘం
నవతెలంగాణ-మంథని
రెవెన్యూ శాఖలో గౌరవ వేతనంపై పని చేస్తున్న సుమారు23,000 మంది వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయుటకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల మంథని మండల వీఆర్ఏలు ప్రధాన చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేస్తున్నందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రెవెన్యూ శాఖలో వీఆర్వో వ్యవస్థ రద్దు అయినందున పని భారాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ స్థాయిలో పరిపాలన సజావుగా సాగేందుకు వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింపజేసి రెవెన్యూ శాఖలో కొనసాగించాలని వారు కోరారు.వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని,అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు. ఈ విషయంపై ప్రభుత్వానికి ట్రెసా అనేక మార్లు రిప్రెసెంట్ చేసిందని ట్రెసా ప్రతినిధులు ఈ సందర్భంగా గుర్తు చేశారు.గతంలో ముఖ్యమంత్రి దగ్గర చర్చించినపుడు వీఆర్ఏలను రెవెన్యూ శాఖలో కొనసాగిస్తామని సుమారు3వేల మందిని మాత్రమే ఇరిగేషన్ శాఖకు ఆప్షన్స్ ద్వారా పంపిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.కాగా ప్రభుత్వం రెవెన్యూ విధులను బట్టి సిబ్బందిని కేటాయించి రెవెన్యూ శాఖను బలోపేతం చేయుటకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.రెగ్యులరైజ్ చేయడం పట్ల రాష్ట్రంలోని వీఆర్ఏలందరికి ట్రెసా నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా మంత్రులు కేటీఆర్,హరీష్ రావుకు వీఆర్ఏలు కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో మంథని మండలంలోని వీఆర్ఏ సంఘంనాయకులు,వీఆర్ఏలు పాల్గొన్నారు.

Spread the love