క్రీడాకారులకు బహుమతులు అందజేస్తున్న సర్పంచ్ పుట్ట వెంకటమ్మ రామయ్య

– గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి
– ఘనంగా సర్పంచ్ కప్ క్రికెట్ పోటీలు
నవతెలంగాణ – మంథని: గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని సర్పంచ్ పుట్ట వెంకటమ్మ రామయ్య అన్నారు. గురువారం మంథని మండలంలోని ఖానాపూర్ గ్రామంలో సర్పంచ్ పుట్ట వెంకటమ్మ రామయ్య నేతృత్వంలో సర్పంచ్ కప్ క్రికెట్ పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పోటీలలో విజేత సాధించిన వారికి ప్రథమ బహుమతిగా రూ 2016 లు, ద్వితీయ బహుమతిగా రూ 1016 లతో పాటు క్రీడాకారులకు షీల్డ్ రూపంలో బహుమతులు కూడా అందించి,క్రీడాకారులను ప్రోత్సహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ యువత అన్ని రంగాల్లో ముందుండాలని, యువతకు ప్రోత్సాహం అందించేందుకు వారికి ఎల్లవేళలా పంచాయతీ పాలకవర్గం తరఫున ప్రోత్సాహకం ఉంటుందని, జీవితంలో ఆశయం పెట్టుకుని ఆశయం సాధించేలా ఆచరణ చేయాలని, భవిష్యత్తులో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహించేందుకు పంచాయతీ పాలకవర్గం ఎల్లప్పుడూ ముందుంటుందని ఆమె మాట్లాడటం జరిగింది. సీఎం కప్ క్రీడా పోటీలలో పథకాలు సాధించిన వారిని సర్పంచ్ పూట వెంకటమ్మ రామయ్య ప్రత్యేకంగా అభినందించి వారిని ఘనంగా శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంథిని మల్లేష్, పంచాయతీ పాలకవర్గం గ్రామ కారోబార్ అమ్మకుంటి శ్రీధర్, మల్టీపర్పస్ వర్కర్స్ ఆరెళ్ళి రిషి కుమార్, క్రీడాకారులు, క్రీడాభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love