దేశానికి త్యాగమూర్తుల చేసిన సేవలు మరువలేనివి

charset=InvalidCharsetId

నవ తెలంగాణ-వీర్నపల్లి

77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీర్నపల్లి మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి భూలా, తహశీల్దారు కార్యాలయంలో తహశీల్దార్ ఉమా రాణి, గ్రామ పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ దినకర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ హెచ్ ఎం రవి, ఆదర్శ పాఠశాలలో, ప్రైమరీ స్కూల్ లో ప్రధానోద్యాయురాలు వకుళ, వెంకట్ రెడ్డి, ప్రభుత్వ కార్యాలయాల్లో , యువజన సంఘాలు, కే డి సి సి బ్యాంకు వద్ద, అన్ని గ్రామాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఎందరో మహానుబావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. దేశానికి త్యాగమూర్తుల చేసిన సేవలు, త్యాగాలు మరువలేనివన్నారు . ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు లింగం, రజిత, కరుణ, ఎంపిటిసి లు అరుణ్ కుమార్, రేణుక, పద్మ , ఎంపిడివో నరేష్, ఎ ఎస్ ఐ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ రవి,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love