సుందరయ్య చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సిపిఎం పార్టీ నాయకులు

– 19 సిరిసిల్ల 02 మాట్లాడుతున్న సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు స్కైలాబ్ బాబు.
– సుందరయ్య స్పూర్తితో ప్రజాఉద్యమాలు నిర్మిద్దాం…
– విలువలు త్యాగాలు సుందరయ్య నుండి నేర్చుకోవాలి..
– సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు పిలుపు.
– సిరిసిల్ల లో సుందరయ్యకు ఘన నివాలి.
నవతెలంగాణ – సిరిసిల్ల
విలువలు త్యాగాలు నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనమైన ఆదర్శ ప్రజానేత సిపిఎం అగ్రనేత సుందరయ్య స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మించాలని, విలువలు, త్యాగాలు ఆయన నుండి నేర్చుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టీ స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం సిరిసిల్ల నెహ్రూ నగర్ లోని ఆర్ఎంపి భవన్ లో సుందరయ్య 38వ వర్ధంతి సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి సిపిఎం సీనియర్ నాయకులు బొద్దుల లక్ష్మీనారాయణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం “సుందరయ్య జీవితం రాజకీయ నైతిక విలువలు” అనే అంశంపై సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రధాన వక్తగా హాజరైన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ.. మన దేశ కమ్యూనిస్టు ఉద్యమ ప్రసిద్ధి చెందిన నేతల్లో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఒకరని అన్నారు. సామాజిక అణిచివేతకు వ్యతిరేకంగా తన కుటుంబంలోనే సాంఘిక సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించిన మహనీయుడు సుందరయ్య అని కొనియాడారు. తన వాటాకు వచ్చిన ఆస్తి మొత్తాన్ని పేద ప్రజలకు పంపిణీ చేసిన గొప్ప నిస్వార్ధ జీవి సుందరయ్య అన్నారు.నేటి భూర్జువ రాజకీయ నాయకులలో స్వార్థం అణిచివేత దోపిడీ వంటి లక్షణాలు పెరిగి ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.నాటి సుందరయ్య లాంటి నాయకులు ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేయడమే కాకుండా విలువల కోసం తుది శ్వాస వరకు నిలబడ్డారని కొనియాడారు. కేంద్ర బిజెపి సర్కార్ ప్రజాసమస్యలను గాలికొదిలేసి మతవిద్వేశాలు రెచ్చగొడు తుందన్నారు. పార్లమెంట్ లో సుమారు 300మంది శతకోటిశ్వర్లు ఉన్నారని వీళ్లు పేదలకు ఏమి మేలు చేస్తారని అన్నారు. సుందరయ్య లాంటి ఆదర్శ ప్రజానేతలు ఈ దేశానికి అవసరం ఉందన్నారు. సుందరయ్య స్పూర్తితో ప్రజాఉద్యమాలను ఉదృతం చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, ఎర్రవెల్లి నాగరాజు, జవ్వాజి విమల, మల్లారపు అరుణ్ కుమార్, ముక్తికాంత అశోక్, అన్నల్దాస్ గణేష్, గురజాల శ్రీధర్, శ్రీరాం సదానందం, సూరం పద్మ, మల్లారపు ప్రశాంత్, సిపిఎం సీనియర్ నాయకులు మిట్టపల్లి రాయమల్లు, ప్రజాసంఘాల నాయకులు మోర అజయ్, శ్రీరాముల రమేష్ చంద్ర, కూర రాకేష్, ఎలిగేటి రాజశేఖర్, గీస బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love