అభ్యాస పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలి

– సర్పంచ్ సింగం శ్రీలత చంద్రయ్య.
నవతెలంగాణ-గోవిందరావుపేట
అభ్యాస పుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని బుసాపురం సర్పంచ్ సింగం శ్రీలత చంద్రయ్య అన్నారు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోమసాని రాజమౌళి అధ్యక్షతన అభ్యాస పుస్తకాల పంపిణీ  కార్యక్రమానికి సర్పంచ్ శ్రీలత చంద్రయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అందించిన ఈ వర్క్ బుక్స్ నీ విద్యార్థులు సద్వినియోగపరుచుకుని భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదిగి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తేవాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రగతికి ప్రత్యేక శ్రద్ద కనబరుచాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బేతి దేవేందర్ రెడ్డి, గ్రామ పంచాయితీ కార్యదర్శి అశోక్, ఎస్ఎంసి చైర్మన్ సదానందం, ఉపాధ్యాయులు ఓదెలు,సతీష్, మల్లారెడ్డి, దిలీప్ మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love