క్రీడాలతో మనసికోన్నసం…

నవతెలంగాణ – డిచ్ పల్లి.
సిఎం కప్‌ 2023 క్రీడా పోటీలు బుధవారం ముగిశాయి. డిచ్ పల్లి మండలంలోని ఖిల్లా డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలలోని గన్నరం గ్రామలలా లోని జడ్పిఎస్‌ఎస్‌లో పాఠశాల మైదానంలో నిర్వహించిన ఈ పోటిలో గేలుపోందిన క్రిడాకరులకు ఎంపిపి బాదవత్ రమేష్ నాయక్, ఎంపిడివో రాములు నాయక్, గోపి బాబు, తహసిల్దార్లు శ్రీనివాస్ రావు, టివి రోజా ప్రజా ప్రతినిధులతో కలిసి అందజేశారు. ఈ సందర్బంగా ఎంపిపి బాదవత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు ఆదేశాల మేరకు మండల స్థాయిలో 15, 16,  17వ తేదిలలో నిర్వహించిన క్రీడపోటిల్లో యువకులు పాల్గొని విజయవంతం చేశారని వివరించారు. మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు వెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.  ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి, ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం కబడ్డీ,ఖోఖో,వలిబల్ మంచి ప్రదర్శన చేసిన జట్లకు మొదటి ద్వితీయ బహుమతులను, ట్రోఫిలను అందజేశారు.ఈకార్యక్రమంలోఎంపివో లు రాజ్ కాంత్ రావు, నిట్టు కిషన్ రావు,నింపి రాజ్ కుమార్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love