2024 పాత పెన్షన్‌ సాధన సంవత్సరం

–  సీపీఎస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 నుంచి 19 ఏండ్లుగా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం (సీపీఎస్‌)తో తెలంగాణలో రెండు లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని టీఎస్‌సీపీఎస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్‌ శ్రీకాంత్‌, కోశాధికారి నరేష్‌గౌడ్‌ తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాత పెన్షన్‌ ఇస్తూ ఉద్యోగుల జీవిత చరిత్రలో వెలుగులు నింపాలని సోమవారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. అందుకే 2024 పాత పెన్షన్‌ సాధన సంవత్సరంగా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసిన దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ తొలి ప్రభుత్వం అవుతుందని తెలిపారు. ఎన్నికలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చినట్టుగా సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని కోరారు.

Spread the love