- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరోసారి 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఇవ్వనున్నారు. ఈ మేరకు కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడంతో ఆగస్టు 1 నుంచి మూడు నెలల బియ్యం పంపిణీకి పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
- Advertisement -



