అంగీకరించిన కర్నాటక సీఎం
వారబందీ పద్ధతిన విడుదల చేయాలని నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జూరాల ప్రాజెక్టుకు నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీటి విడుదలకు కర్నాటక ప్రభుత్వం అంగీకరించింది. వారబంది పద్దతిన 3 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్నాటక సీఎం డీకే. శివకుమార్ అంగీకారం తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు ఆ రాష్ట్ర సీఎం, అధికారులతో బుధవారం మరోసారి భేటీ అయ్యారు. ఎల్నినో ప్రభావం, జూరాల ప్రాజెక్టు వద్ద నీటి మట్టం, సాగునీటి కోసం ఆయకట్టు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తిపై కర్నాటక సీఎం వెంటనే ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. చలువరాయస్వామి, కర్నాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షాలిని రాజనీష్తో మాట్లాడి, తెలంగాణకు సహాయం చేయాల నీ, వీలైనంత త్వరగా నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. కర్నాటకలోనూ నీటి కొరత, ఇబ్బందులు ఉన్నప్పటికీ తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 10 రోజుల పాటు వారాబందీ విధానంలో నీటిని విడుదల చేస్తామని కర్నాటక నిర్ణయించింది.
నేడు ఉమ్మడి పాలమూరు
ప్రజాప్రతినిధుల భేటీ
జూరాలకు కర్నాటక 3 టీఎంసీల నీటి విడుదలకు అంగీకరించిన నేపథ్యంలో నేడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజాప్ర తినిధులు, అదికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్టు మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు తెలిపారు. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిలాసాగర్ ప్రాజెక్టుల నుంచి సాగు, తాగునీటి అవసరాలకు అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చిస్తామని తెలిపారు. రైతుల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమనీ, అందుబాటులో ఉన్న నీటి వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తూ ఆయకట్టు రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ నెల 20న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కర్నాటక ముఖ్యమంత్రికి లేఖ రాశారని తెలిపారు. అనంతరం ఆ రాష్ర్ట ప్రభుత్వంతో నిరంతర సంప్రదిం పులు జరుపుతూ జూరాలకు నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. రైతులు, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చారు.
జూరాలకు 3 టీఎంసీల నీటి విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



