34 గ్రామపంచాయతీలు 10మంది ప్రత్యేక అధికారులు

– ఇద్దరికీ ఆరు చొప్పున, ఆరుగురికి మూడు చొప్పున, ఇద్దరికీ రెండు చొప్పున, పంచాయితీల అప్పగింత,
నవతెలంగాణ –  మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్, దొంగ్లి, మండలాల పరిధిలో మొత్తం 34 గ్రామపంచాయతీలు ఉన్నాయి సర్పంచుల పదవీకాలం ముగియగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిస్తోంది. 34 గ్రామపంచాయతీలకు గాను పదిమంది మాత్రమే ప్రత్యేక అధికారులు పాలన కొనసాగిస్తున్నారు. వీటిలో మద్నూర్ మండల అభివృద్ధి అధికారిని పరుచూరి రాణి కి ఆరు గ్రామపంచాయతీలు అలాగే మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్యకు ఆరు గ్రామపంచాయతీలు మరో ఆరుగురి అధికారులకు మూడు గ్రామ పంచాయతీల చొప్పున మరో ఇద్దరి అధికారులకు రెండు గ్రామపంచాయతీల చొప్పున ప్రత్యేక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం విధులు అప్పగించింది. ఒక్కొక్కరికి ఆరు గ్రామపంచాయతీలు మూడు గ్రామ పంచాయతీలు రెండు గ్రామపంచాయతీలు అప్పగించడం అధికారులు విధులు నిర్వర్తించడంలో ఏ ఊరికి ఎప్పుడు వెళ్లాలి అనేది సందిగ్ధంగా కనిపిస్తోంది. వారానికి ఏడు రోజులు దాంట్లో ఒకరోజు ఆదివారం ఇక మిగిలినవి ఆరు రోజులు రోజుకు ఒక్క ఊరుకు వెళ్లిన వారం గడిచిపోతుంది. మళ్లీ వారం వరకు ఆ పంచాయతీకి వెళ్లాలంటే సమయం లేని పరిస్థితి మూడు గ్రామాలు ఉన్న అధికారులకు రెండు రోజులకు ఒకసారి వెళ్లవలసిన పరిస్థితి. ఇక రెండు గ్రామాలు ఉన్న అధికారులకు మూడు రోజులకు ఒకసారి వెళ్లవచ్చు. పంచాయితీలు ఎక్కువ ప్రత్యేక అధికారులు తక్కువ ఒక్కొక్కరికి మూటగట్టినట్టు గ్రామపంచాయతీలు అప్పగిస్తే ఆ అధికారి ఏ రోజు ఏ ఊరికి వెళ్ళాలో అధికారికే తెలియని పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగా మద్నూర్ ఉమ్మడి మండలంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. అసలే వేసవికాలం త్రాగునీటి సమస్య రాకుండా ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఒక్కొక్క అధికారి ఆరు గ్రామపంచాయతీలు పాలన కొనసాగించాలంటే గ్రామాలను సందర్శించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎన్నికల్లో అధికారులు ఒకపక్క బిజీబిజీగా ఉండడం మరోపక్క అధికారులకు ప్రత్యేక అధికారులుగా నియమించడం అధికారులకు ఇబ్బందికరంగానే విధుల నిర్వహణ కనిపిస్తోంది. ప్రస్తుతానికి మద్నూర్ ఉమ్మడి మండలంలో ఏ గ్రామంలో కూడా అత్యవసరమైన సమస్యలు ఏర్పడకపోవడం ప్రత్యేక అధికారుల పాలనకు ఇబ్బందులు రాకుండా ఉండటం ఒక్కొక్క అధికారికి ఎన్ని పంచాయితీలు అప్పగించిన ప్రత్యేక అధికారుల పాలన సజావుగానే కొనసాగుతున్నాయి. గ్రామాల్లో ప్రజా సమస్యలు ఏర్పడకుండా ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి సాధించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఉమ్మడి మండల ప్రజల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది.

Spread the love