మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న హర్రర్ థ్రిల్లర్ ‘418’ విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఈనెల 31న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పి స్తున్న ఈ చిత్రానికి కీర్తన్ నడగౌడ కథ, దర్శకత్వం వహించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆరంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టేలా సరికొత్త హారర్ అనుభూతిని అందించ బోతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా, విడుద లకు మరో రెండు వారాల సమయం ఉండడంతో త్వరలోనే ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయబోతున్నారు అని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ చిత్రానికి దినేష్ దివాకర్ సినిమాటోగ్రఫీ అందిం చగా, వెంకీ జీజీ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు.
‘418’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -



