Monday, July 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'రామాయణ'.. మహా ప్రయాణానికి శ్రీకారం

‘రామాయణ’.. మహా ప్రయాణానికి శ్రీకారం

- Advertisement -

భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత గొప్ప సాంస్కృతిక వారసత్వాల్లో రామాయణం ఒకటి. తరతరాలుగా ఇది కేవలం ఒక ఇతిహాసంగా మాత్రమే కాకుండా, భారతీయుల పండుగలు, విలువలు, జీవన విధానం, సంస్కృతిలో విడదీయరాని భాగంగా కొనసాగుతోంది. ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా ట్రైలర్ విడుదలకు ముందు నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ‘రామాయణ’ చిత్ర బృందం న్యూఢిల్లీలో ప్రత్యేకంగా తొలి ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘ప్రథమ్ సంకల్ప్’ పేరుతో నిర్వహించిన ఈ వేడుక భారత్ నుంచి ప్రపంచానికి రామాయణ ప్రయాణానికి శ్రీకారంగా నిలిచింది. ఈ వేడుకలో భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఒకే వేదికపై సందడి చేశారు. రామానంద్ సాగర్ ‘రామాయణం’ లో శ్రీరాముడి పాత్రతో కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన అరుణ్ గోవిల్, ఈ చిత్రంలో దశరథ మహారాజు పాత్రలో కనిపించనున్నారు. అలాగే శోభన కైకేయి పాత్రలో, అజింక్య దేవ్ విశ్వామిత్ర మహర్షిగా, కునాల్ కపూర్ ఇంద్రుడిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా, రవీ దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఈ అద్భుత తారాగణానికి నాయకత్వం వహిస్తున్నది రణ్‌బీర్ కపూర్. ఆయన శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. సాయి పల్లవి సీతాదేవి పాత్రలో తన హుందాతనం, కరుణ, ఆత్మస్థైర్యాన్ని తెరపై ఆవిష్కరించనుండగా, యశ్ ఈ చిత్రానికి తన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ద్వారా సహ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు, మహాబలశాలి రావణుడు పాత్రను పోషిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -