సుమంత్ హీరోగా ఈవిన్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేశ్ కర్ణ దర్శకత్వంలో కె.హరీశ్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ‘ధమ్ ధమ్సాంగ్ లాంచ్ చేశారు. హీరో సుమంత్ మాట్లాడుతూ,'ఈ కథను ఒకే సిట్టింగ్‌లో ఓకే చేశాను. 'అనగనగా' తర్వాత ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కథ విన్న వెంటనే వినయ్ పాత్ర, కార్తీక్ పాత్ర చాలా బలంగా ఉండాలని చెప్పాను. ఆ రెండు పాత్రలు అద్భుతంగా ఉంటేనే సినిమా ఆడు తుందని అప్పుడే అనుకున్నాను. నిజంగానే ఇద్దరూ అద్భుతంగా నటించారు. ఈ పాట కూడా వాళ్ల పాత్రల పైనే ఉంటుంది. ఈనెల 31న ఈ సినిమా ప్రేక్షకుల ముం దుకు వస్తోంది. చాలా మంచి సినిమాతో వస్తున్నాం అని తెలిపారు. ‘మా విజయవంతమైన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’కు సంగీతం అందించిన సింజిత్ ఈ సినిమాకూ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సుమంత్ లాంటి నటుడు తెలుగు సినీ పరిశ్రమలో ఉండడం మా అదృష్టం. ‘అనగనగా’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనను ఎప్పటికీ మర్చిపోలేం. ఆ సినిమా విజయ వంతంగా కొనసాగుతోంది. మా సక్సెస్ జర్నీ కూడా ‘అనగనగా’తో ప్రారంభమైంది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సినిమా కూడా ఆ విజయాన్ని కొనసాగిస్తుందని నమ్ముతున్నాంఅని ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ చెప్పారు. దర్శకుడు రాజేష్ కర్ణ మాట్లాడుతూ,'ఈటీవీ విన్ ఈ సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మాకు పూర్తి సహకారం అందించింది. వారి గట్స్, సినిమాపై ఉన్న ప్యాషన్ అభినందనీయం. థ్రిల్లర్ జోనర్ గురించి మాట్లాడినప్పుడల్లా 'న్యూటన్స్ థర్డ్ లా' పేరు కూడా తప్పకుండా వినిపిస్తుంది. ఈ సినిమా థ్రిల్లర్ జానర్‌ను రీడిఫైన్ చేస్తుంది అని తెలిపారు.
అలరించే యూనిక్ థ్రిల్లర్
- Advertisement -
- Advertisement -



