పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ల మీద పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడ పాక నిర్మాణంలో నిహారిక కొణిదెల రూపొందించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ మూవీతో యదు వంశీ దర్శ కుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటుకుంది. ఉత్తమ జాతీయ తెలుగు చిత్రం, బెస్ట్ మేకప్ కేటగిరీల్లో రెండు జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ తమ ఆనందాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు. నిర్మాత నిహారిక కొణిదెల మాట్లా డుతూ,’ఈ చిత్రంలో పని చేసిన ప్రతీ ఒక్కరి జర్నీ నాకు తెలుసు. ఈ చిత్రానికి జాతీయ అవార్డులు రావడంతో నా మనసు సంతృప్తితో నిండిపోయింది. నా 32 ఏళ్ల ఈ జీవితంలో ఈ సినిమాకి ఓకే చెప్పడంతో గొప్ప నిర్ణయం. ఇది నా సినిమా, ప్రాణం పెట్టాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. మంచి సినిమా తీసినా కూడా అది ఆడియెన్స్ వరకు తీసుకు వెళ్లగలగాలి. ఈ చిత్రంలో అందరి కష్టం ఉంది. యదు వంశీ ఎప్పుడూ నేషనల్ అవార్డ్ వస్తుందని చెబుతూనే ఉండేవారు. 72వ జాతీయ అవార్డుల్లో మేం కూడా ఉండాలని అనుకున్నాను. నా కల నేడు నెరవేరిందిఅని తెలిపారు. ‘నేషనల్ అవార్డ్ కొడుతుందని ముందు నుంచీ అందరికీ చెప్తూనే వచ్చాను. బెస్ట్ ఫిల్మ్ అంటే.. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్, టెక్నిషయన్ బెస్ట్ ఇస్తేనే వస్తుంది అని దర్శకుడు యదు వంశీ చెప్పారు.
నా మనసు సంతృప్తితో నిండిపోయింది : నిహారిక
- Advertisement -
- Advertisement -



