Monday, July 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలువైవిధ్యమైన కథ, కథనాలతో 'హే చికీతా

వైవిధ్యమైన కథ, కథనాలతో ‘హే చికీతా

- Advertisement -

అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్ల మీద ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి నిర్మించిన చిత్రం ‘హే చికీతా’.అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని ధనరాజ్ లెక్కల తెరకెక్కించారు. ఈ సినిమాని ఈనెల 24న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చదలవాడ శ్రీనివాసరావు, టి.రామసత్యనారాయణ, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, అలీ, వీఎన్ ఆదిత్య, ప్రసన్న కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ,'‘హే చికీతా’ టీంని చూస్తే నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. ఇందులో ఆర్టిస్టులు అంతా బాగా నటించారు. అంజి కెమెరా వర్క్ బాగుంది. దర్శకుడు, నిర్మాత ..అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను.చిన్న సినిమాతో హిట్ కొడితే వచ్చే సంతృప్తి అంతా ఇంతా కాదు అని తెలిపారు. గరుడవేగ అంజి మాట్లాడుతూ,’మళ్లీ సక్సెస్ మీట్‌లో కలుసుకుందాంఅని అన్నారు. నిర్మాత ఎన్. అశోక ఆర్ఎన్ఎస్ మాట్లాడుతూ,'చరణ్ అర్జున్ పాటలు అద్బుతంగా ఉన్నాయి అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -