మేడారం మినీ జాతర ముగిసినా.. భక్త జన సంద్రంగా మేడారం

 

-మంచె పై నుండి పర్యవేక్షించిన పోలీస్ అధికారులు
నవతెలంగాణ – తాడ్వాయి
మేడారం మినీ జాతర ముగిసింది. అయినప్పటికీ భక్త జన ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉంది. మేడారం మినీ జాతర 4వ తారీకు తో ముగిసినప్పటికీ మేడారానికి భక్తులు మాత్రం పోతెచ్చుతున్నారు. మేడారం జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి రెండు లక్షలకు పైగా భక్తులు తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జంపన్న వాగు వద్ద పుణ్య స్థానాలు ఆచరించి, కళ్యాణ కట్టలో నీలాలు సమర్పించుకుని వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శివశక్తుల పూనకాలతో సకుటుంబ సపరివార సమేతంగా వనదేవతలను దర్శించుకున్న భక్తులు అమ్మవారికి ముడుపులు చెల్లించుకున్నారు.
మంచి పైనుండి పరిశీలిస్తున్న ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం
మినీ మేడారం జాతర అనంతరం ఆదివారం కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు ఇలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా మేడారంలో పట్టుదిత్వమైన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, అడిషనల్ ఎస్పీ సదానందం, ములుగు సిసిఎస్ సి ఐ రవీందర్, స్థానిక ఎస్సై వెంకటేశ్వరరావును మేడారంలోని ఎండోమెంట్ ప్రాంగణంలో గల మంచే పై నుండి పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు, సాంఘిక సంఘటనలు జరగకుండా, గద్దెల ప్రాంగణంలో తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకున్నారు. ములుగు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న గౌస్ ఆలం ములుగు జిల్లాలో జరుగుతున్న మొట్టమొదటి మినీ జాతరను ములుగు జిల్లా పోలీస్ యంత్రాంగంతో కలిసి విజయవంతం చేసిన ఘనత ఆయనకే దక్కింది. పూజారులు, ఎండోమెంట్ అధికారులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

Spread the love