జేఎల్‌ పరీక్షకు రెండోరోజు 60.20 శాతం హాజరు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్‌ విద్యాశాఖ కమిషనరేట్‌ పరిధిలో ప్రకటించిన జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్‌) పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న రాతపరీక్షలకు బుధవారం రెండోరోజు ఉదయం 59.60 శాతం మంది, మధ్యాహ్నం 60.20 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) కార్యదర్శి అనితా రామచంద్రన్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీఆర్టీ) ద్వారా నిర్వహిస్తున్న ఈ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌ పరీక్షకు 19,776 మంది దరఖాస్తు చేయగా, 11,786 (59.60 శాతం) మంది హాజరయ్యారని వివరించారు.

Spread the love