లక్ష మెజార్టీలో 60వేలు రిగ్గింగ్ ఓట్లే

– మంత్రి హరీశ్ రావు..ఈడీ మెట్లు ఎక్కక తప్పదు
– బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాయిని నరోత్తంరెడ్డి 
నవతెలంగాణ – సిద్దిపేట
మంత్రి హరీశ్ రావు కు వచ్చిన లక్ష ఓట్ల మెజార్టీలో 60 వేల ఓట్లు రిగ్గింగ్ ద్వారానే పడతాయని, పోలీసులు,  స్థానిక ఉద్యోగులను అడ్డం పెట్టుకొని పోలింగ్ బూత్ లను క్యాప్చర్ చేస్తారని, హరీశ్ రావు నీతిపరుడు అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,  సిఆర్ పి ఎఫ్ బలగాలతో నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించే విధంగా ఉత్తరం రాయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాయిని నరోత్తంరెడ్డి కోరారు. సోమవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు, ప్రతిపక్ష నాయకులు బలపడుతుంటే పోలీసుల తో బలవంతంగా కేసులు పెట్టిస్తారని అన్నారు. మంత్రి హరీశ్ రావు, బినామీల లీలలు  అధారాలు దర్యాప్తు సంస్థలకు అప్పగించినట్లు తెలిపారు. త్వరలోనే మంత్రి ఈడి మెట్లు ఎక్కుతారని అన్నారు. సిద్దిపేట నియోజక వర్గంలో రూ.10వేల కోట్ల రియల్ ఎస్టెట్ వ్యాపారం మంత్రి బినామీల పేరిట కొనసాగుతుందన్నారు. రూ.3వందల కోట్లతో కోమటి చెరువును సుంధరీకరించినట్లు గొప్పలు చెబుతున్న మంత్రి, ఎంత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయో ప్రజలు తెలపాలన్నారు. అక్కడికి వచ్చే వారి టికెట్టు రూపంలో డబ్బులు తీసుకుంటున్నారని అన్నారు. నియోజక వర్గ పరిధిలోని ప్రతి గ్రామ నిరుద్యోగ యువతతో ఉద్యమానికి శ్రీకారం చుడతానని స్ఫష్టం చేశారు. రంగనాయక సాగర్ పర్యటక ప్రాజెక్టా..సాగునీటి ప్రాజెక్టా అర్ధం కావడం లేదని, గ్రామాలల్లో రైతులను అడిగితే..ప్రాజెక్టు నిర్మాణం తర్వత సాగు విస్తీర్ణం పెరిగిందా, తగ్గిందా అన్న విషయం తెల్చిచెబుతారన్నారు. మంత్రి విలన్ రూపంలో ఉన్న హీరో అని అన్నారు. కరీంనగర్ లో తాను నిర్మాణం చేపట్టిన వాటి నుండి తప్పుకున్న తర్వాత, హుజురాబాద్ ఎన్నికల అనంతరం తనపై మూడు కేసులు పెట్టించారని నేరుగా రాజకీయాలు చేయలేని వ్యక్తి అని అన్నారు. ఈమధ్య నా ఆధ్వర్యంలో నడుస్తున్న  ఛానల్ లో ఓ వార్త ప్రసారం చేసినందుకు 15 రోజుల క్రితం నాకు నోటీసులు పంపించాడని అన్నారు. మంత్రి అవినీతి పై హరీశ్ రావు ఫైల్స్ పేరిట ప్రజల ముందు బట్టబయలు చేస్తా అన్నారు. బిజెపి నుండి ఎవరు పోటీ చేసిన ఆయన మెజార్టీ పైనే ప్రచారం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు గుండ్ల జనార్ధన్, బాలకృష్ణ రెడ్డి, గోపినాథ్ రెడ్డి, లింగారెడ్డి, ఉమారాణి, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love