రైతుబంధు కింద తొలిరోజు రూ.642.52 కోట్లు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రైతుబంధు నిధుల విడుదలలో భాగంగా తొలి రోజైన సోమవారం 22,55,081 మంది రైతుల ఖాతాల్లో రూ.642.52 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్‌ చెప్పిన ప్రకారం…రైతు బంధు నిధుల జమ ప్రారంభమైందని తెలిపారు. ఎకరాల వారీగా ప్రతి రోజు రైతుల ఖాతాలలో నిధులను జమ చేస్తామని వివరించారు. సీఎం కేసీఆర్‌ కు, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావుకు సింగిరెడ్డి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ శాఖ ద్వారా అందుతున్న సూచనల పాటించాలని ఆయన రైతులును కోరారు.

Spread the love