వాణిజ్య వాహన అమ్మకాల్లో 7శాతం పతనం

వాణిజ్య వాహన అమ్మకాల్లో 7శాతం పతనం– ఇక్రా అంచనా
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో వాణిజ్య వాహన రంగం అమ్మకాల్లో 4-7 శాతం పతనం చోటు చేసుకోవచ్చని రేటింగ్‌ ఎజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గడిచిన 2023-24లో టోకు అమ్మకాల్లో 1 శాతం, రిటైల్‌ విక్రయాల్లో పెరుగుదల ఉందని తెలిపింది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో మౌలిక వసతుల రంగం కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడంతో చివరి త్రైమాసికం అమ్మకాల్లో 4 శాతం తగ్గుదల చోటు చేసుకుందని పేర్కొంది. ఈ ఏడాది తేలికపాటి వాణిజ్య వాహన అమ్మకాలు ఏకంగా 5-8 శాతం తగ్గొచ్చని విశ్లేషించింది. మౌలిక వసతుల రంగంలో నెలకొన్న పలు సవాళ్లు వాహన రంగంపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని ఇక్రా పేర్కొంది.

Spread the love