500 రోజుల్లో 500 ఇవి ఛార్జర్స్ ఏర్పాటు చేసిన ఎంజి మోటార్ ఇండియా

నవతెలంగాణ- హైదరాబాద్: 100 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ MG (మోరిస్ గ్యారేజెస్), భారతదేశంలో తన ఎంజి ఛార్జ్ కార్యక్రమం కింద 500 రోజుల్లో 500 ఛార్జర్‌లను విజయవంతంగా ఏర్పాటు చేసినట్లు ఈరోజు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్, దేశవ్యాప్తంగా స్థిరమైన, అందుబాటు కలిగిన ఎలక్ట్రిక్ వాహనాల (ఇవి) ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే లక్ష్యంతో, 2022 మధ్యలో ప్రారంభమయింది, అగ్రశ్రేణి అపార్ట్ మెంట్లు, కండోనియమ్‌లు, సొసైటీల్లో వాటి నివాసులు, సందర్శకులకు సులువైన ఛార్జింగ్ సేవల కోసం 1,000 రోజుల్లో 1,000 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడానికి ఇది అంకితమయింది. ఈ సందర్భంగా, గౌరవ్ గుప్తా, చీఫ్ గ్రోత్ ఆఫీసర్, ఎంజి మోటార్ ఇండియా, మాట్లాడుతూ..“అత్యాధునికమైన ఎలక్ట్రిక్ వాహనాలను అందజేయడానికి మించి కృషి చేయాలని ఎండి ఆకాంక్షిస్తోంది. 500 ఛార్జర్లను సరిగ్గా అన్నే రోజుల్లో ఏర్పాటు చేయడం అనే ఈ మైలురాయి హరిత ప్రయాణానికి మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రజలు దాన్ని విస్తృతంగా అనుసరించడాన్ని ప్రోత్సహించే బలమైన ఇవి పర్యావరణ వ్యవస్థను సృష్టించాలన్న ఎంజి దార్శనికతను కూడా చాటి చెబుతోంది. కేవలం ఛార్జర్లు మాత్రమే కాకుండా స్థిరమైన, ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఎలక్ట్రిక్ వాహన యాజమాన్య అనుభవాన్ని పూర్తిగా మెరుగుపరచడం, సౌకర్యవంతమైన, అందుబాటుతో కూడిన పరిష్కారాలను అందించడంలో మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది” అని తెలిపారు.
ఎంజి మోటార్ ఇండియా తన పర్యావరణ వ్యవస్థ భాగస్వాములు – ఎక్సికామ్‌టెలీసిస్టమ్స్, ఎలక్రీఫై, ఇఛార్జ్‌ బేస్, లోనేజ్, స్టాటిక్ & హైవే డిలైట్‌లతో కలిసి వ్యూహాత్మకంగా 7.4కెడబ్ల్యూ ఛార్జర్‌లను ఏర్పాటు చేస్తోంది, సగటున రోజుకు ఒక ఇన్‌స్టాలేషన్‌తో, సుమారు 50 ప్రధాన నగరాలకు సేవలు అందిస్తోంది. ఈ మైలురాయి దేశంలో బలమైన ఇవి పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ద్వారా హరిత ప్రయాణాన్ని వేగవంతం చేయడంలో కార్ల తయారీదారు తాలూకు తిరుగులేని నిబద్ధతను ప్రదర్శిస్తోంది.
ఎంజి వారి ఇవి నిబద్ధత: బహిరంగంగా మరియు గృహాల్లో ఛార్జర్ల తో సహా దేశవ్యాప్తంగా 15,00కు పైగా ఛార్జింగ్ టచ్ పాయింట్లతో పటిష్టమైని ఇవి ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటులో ఎంజి మోటార్ ఇండియా కీలకపాత్ర పోషించింది. ఇవి ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం గ్లిడా, డిపిసిఎల్, బిపిసిఎల్, జియో-బిపి, స్టాటిక్యూ, జియోన్ మరియు ఛార్జింగ్‌జోన్ లాంటి తన ఎకోసిస్టమ్ భాగస్వాములతో, బ్యాటరీ రీసైకిలింగ్, పునర్వినియోగం, వాటి జీవితకాలం పెంపుదల కోసం అట్టెరో మరియు లోహుమ్‌లతో కంపెనీ సన్నిహితంగా పని చేస్తోంది. ముఖ్యంగా, నీతి ఆయోగ్ నేతృత్వంలోని శూన్య – జీరో పొల్యూషన్ మొబిలిటీ ప్రచారంలో ఇటీవలి భాగస్వామ్యం, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంలో ఎంజి మోటార్ ఇండియా యొక్క నిబద్ధతను చాటిచెబుతోంది. సుస్థిరతపై ఒక సమగ్రమైన దృక్పథం కలిగిన ఎంజి మోటార్ ఇండియా పరిణామం చెందుతున్న ఎలక్ట్రిక్ ప్రయాణ రంగంలో ప్రతిభా అంతరాలను భర్తీ చేయడానికి నైపుణ్యాలను, నైపుణ్యాల పెంపును అందించే చర్యలు చేపడుతోంది. తయారీల్లో 50% ఎనర్జీని పునరుత్పాదక వనరుల నుంచి తీసుకోవడం ద్వారా హరితమైన ఉత్పాదక చర్యలకు కంపెనీ అంకితమయింది. సిఓ2 ఉద్గారాల తగ్గింపును 36 శాతం మేరకు తగ్గించగా, 2024 సంవత్సరం చివరికల్లా 11,889 మెగా టన్నుల తగ్గింపును అంచనా వేస్తున్నారు. ఈ రోజు, ఎంటి మోటార్ ఇండియా రెండవ అతి పెద్ద ఇవి విక్రయదారు, 25,000 యూనిట్లకు పైగా తన ఇవి మోడల్స్ -జెడ్ఎస్ మరియు కామెట్‌లను విక్రయించింది; ఇది కంపెనీ మొత్తం విక్రయాల్లో 25-30 శాతంగా ఉంది.

Spread the love