మొన్న బీజేపీ, నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్న తాజా మాజీ సర్పంచ్

నవతెలంగాణ – మద్నూర్
నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండలంలోని దోతి గ్రామ తాజా మాజీ సర్పంచ్ కాశీనాథ్ పటేల్ బీఆర్ఎస్ పార్టీ నుండి మూడు రోజుల క్రితం బీబీ పాటిల్ సమక్షంలో బీజేపీలో చేరగా బీజేపీ కండువా కప్పి బీబీ పాటిల్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. బీజేపీలో చేరి మూడు రోజులకే మొన్న అటు నిన్న ఇటు అన్న చందంగా గురువారం నాడు బీజేపీ పార్టీని వదిలి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సమక్షంలో కాంగ్రెస్లో చేరిన దోతి గ్రామ తాజా మాజీ సర్పంచ్ కాశీనాథ్ పటేల్ బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏ పార్టీలో ఉండాలో, అర్థం కాక తలలు పట్టుకుంటూ రోజుకు ఒక పార్టీలో చేరుతున్నారు. దీనికి నిదర్శనం ధోతి గ్రామ తాజా మాజీ సర్పంచ్ కాశీనాథ్ పటేల్ ఇలాంటి చేరికలతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీల అభ్యర్థుల గెలుపు ప్రశ్నార్ధకంగా కనిపిస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఉంటారు ఓటు ఎటువైపు వేస్తారో నాయకులు గందరగోళంగా కనిపిస్తున్నారు. ముచ్చటగా మూడు రోజులకే ముందుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న తాజా మాజీ సర్పంచ్ బీజేపీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లారు ఇలాంటి చేరికలతో జుక్కల్ నియోజకవర్గంలో నాయకుల చేరికల పట్ల ఏ పార్టీలో కూడా నమ్మసక్యంగా కనిపించడం లేదు. ఎన్నికలు దాదాపు 18 రోజుల సమయం ఉంది. అప్పటివరకు ఇలాంటి నాయకులు ఇంకా ఎటువైపు వెళ్తారు అనేది ఓటు ఎవరికి వేస్తారనేది గందరగోళంగా మారింది. ఇలాంటి పార్టీల మార్పుతో ఏ పార్టీ ఉత్సవపడాలి ఏ పార్టీ నిరుత్సవ పడాలి ప్రజల్లో అనేక రకాల చర్చలు వినబడుతున్నాయి.
Spread the love