నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలం లోని ధన్నూర్ గ్రామంలో సోమవారం నాడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో షుగర్ పరీక్షలు, దంత పరీక్షలు, కంటి పరీక్షలు జరిపి మందులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ శశికుమార్, ప్రమోద్, రెడ్ క్రాస్ సొసైటీ డివిజన్ వైస్ చైర్మన్ డాక్టర్ విక్రమ్ కుమార్, జిల్లా కోశాధికారి దస్తిరాం, మద్నూర్ మండల చైర్మన్ ప్రకాష్ దన్నూర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.