Sunday, May 24, 2026
E-PAPER
Homeజాతీయంవేటకు నదిలో దిగి..ఒకే కుటుంబానికి చెందిన 8మంది మృతి

వేటకు నదిలో దిగి..ఒకే కుటుంబానికి చెందిన 8మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటకలోని తత్తెహక్కలు నదిలో వేటకు దిగిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. జాలర్ల సాయంతో 8మంది మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో 7మంది మహిళలు, ఒకరు పురుషుడు ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో నదిలో ఆల్చిప్పలు విరివిగా దొరుకుతాయి. దీంతో భత్కళ తాలూకా సిరాలి గ్రామానికి చెందిన ఓ కుటుంబం (14మంది) ఉదయం 10గంటల సమయంలో ఆల్చిప్పల కోసం నదిలోకి దిగారు. అదే సమయంలో నది ప్రవాహం పెరగడంతో వారిలో ముగ్గురు కొట్టుకుపోయారు. వారిని రక్షించడానికి ప్రయత్నిస్తుండగా మిగిలిన వారు కూడా ప్రవాహంలో కొట్టుకుపోయారు. వెంటనే స్థానిక జాలర్లు నదిలోకి దిగి ముగ్గురిని రక్షించారు. అప్పటికే మిగిలిన వారు గల్లంతయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -