ఎల్‌కెపి సెక్యూరిటీస్‌ అమ్మకాల్లో 89% వృద్థి

ఎల్‌కెపి సెక్యూరిటీస్‌ అమ్మకాల్లో 89% వృద్థిహైదరాబాద్‌ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 88.61 శాతం వృద్థితో రూ.32.78 కోట్ల అమ్మకాలు నమోదు చేసినట్లు ఆర్థిక సేవల సంస్థ ఎల్‌కెపి సెక్యూరిటీస్‌ తెలిపింది. ఇంతక్రితం ఏడాది ఇదే సమయంలో రూ.17.38 కోట్ల అమ్మకాలు జరిగాయని పేర్కొంది. కాగా.. ఇదే సమయంలో రూ.0.23 కోట్ల నష్టాలను చవి చూడగా.. గడిచిన క్యూ4లో రూ.5.557 కోట్ల నికర లాభాలు సాధించినట్లు వెల్లడించింది. 2023-24లో స్థూలంగా కంపెనీ లాభాలు 154.69 శాతం పెరిగి రూ.9.50 కోట్లుగా.. అమ్మకాలు 25 శాతం వృద్థితో రూ.97.35 కోట్లుగా చోటు చేసుకున్నాయి.

Spread the love