ఆస్తిపన్నుపై వడ్డీ ఫై 90 శాతం రాయితీ..

– గోషామాల్ డిప్యూటీ కమిషనర్ ఎస్ విద్యాధర్..
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
ఆస్తి పన్ను బకాయిల (2022-2023 వరకు) వడ్డీపై 90% రాయితీని ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీచేయనైనది అని జీహెచ్ఎంసీ గోషామహల్ సర్కిల్ -14 డిప్యూటీ కమిషనర్ ఎస్. విద్యాదర్ తెలిపారు, శనివారం అబిడ్స్ లోని జిహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలపై  విధించిన వడ్డీలో 90 శాతం మాఫీ చేస్తూ ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారని, 2022- 23 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న వడ్డీ 90 శాతం మాఫీ చేస్తున్నట్లు, మిగతా 10 శాతం వడ్డీని వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటిఎస్)లో భాగంగా చెల్లిందాల్సి ఉంటుందని తెలిపారు. జీఓ జారీకి  ముందు ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో 2024 మార్చి వరకు వడ్డీ పెనాల్టీలతో సహా మొత్తం ఆస్తి పన్ను ( బకాయిలు) చెల్లించిన పన్ను చెల్లింపుదారులందరికి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందని చెప్పారు, ఈ అవకాశాన్ని సర్కిల్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆదివారం పన్ను న్ను బకాయి దారు దారులకు సందేహాలను నివృత్తి చేసేందుకు ఆదివారం 9.30 నుండి 1.00 గంట వరకు నాలుగవ అంతస్తు, అబిడ్స్, గోషామహల్ సర్కిల్-14, జిహెచ్ఎంసి కార్యాలయంలో తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. ఆస్తి పన్ను ఆస్తి పన్ను (బకాయిదారులు) ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాయితీని పొందాలని చెప్పారు. ఆస్తి పన్ను సకాలంలో చెల్లించి అభివృద్ధి లో భాగస్వాములు కావాలని సూచించారు, ఈ సమావేశంలో సర్కిల్ జిహెచ్ఎంసి అసిస్టెంట్ కమిషనర్ ఎంఎస్ ఫైలజ తదితరులు పాల్గొన్నారు.  03-03-2024 నుండి ప్రతి ఆదివారం ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, స్వీకరించిన ఫిర్యాదులను పరిశీంలించి సకాలంలో పరిష్కరిస్తామని తెలియజేసినారు.
Spread the love