Sunday, June 28, 2026
E-PAPER
Homeఆదిలాబాద్కుభీర్ మండలంలో 96% పల్స్ పోలియో పూర్తి

కుభీర్ మండలంలో 96% పల్స్ పోలియో పూర్తి

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
కుబీర్ మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం 96 శాతం పూర్తయిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ విజేష్ తెలిపారు. ఆదివారం మండలంలో ఆయా గ్రామాల్లో 5339 మంది పిల్లలు పోలియో చుక్కలు వేయడానికి 49 కేంద్రాలను ఏర్పాటు చేసి, 196 మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. ఇప్పటివరకు మొత్తం 5,176 మంది పిల్లలకు  పల్స్ పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించారు.సోమవారం నుంచి ప్రతి ఇంటింటికీ వెళ్లి  పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలకు చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలకు ఇంకా పోలియో చుక్కలు వేయించని తల్లిదండ్రులు వెంటనే గ్రామమలో ఉన్న వైద్య సిబ్బందిని లేదా సంబంధిత అధికారులను సంప్రదించి తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని డాక్టర్ విజేష్ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -