Sunday, June 28, 2026
E-PAPER
Homeజిల్లాలుమౌంట్ కియాగర్ రీ శిఖరాన్ని అధిరోహించిన విశ్లావత్ బన్నీ

మౌంట్ కియాగర్ రీ శిఖరాన్ని అధిరోహించిన విశ్లావత్ బన్నీ

- Advertisement -
  • శిఖరాగ్రంపై సుభాష్ రెడ్డి పేరుతో ప్రత్యేక పతాకం ఎగరవేత
    – యువతకు స్ఫూర్తిగా నిలిచిన సాహసయాత్ర
  • నవతెలంగాణ – కామారెడ్డి
  • లడఖ్‌లోని చాంగ్థాంగ్ పీఠభూమిలో ఉన్న 6,100 మీటర్ల ఎత్తైన ప్రసిద్ధ మౌంట్ కియాగర్ రీ శిఖరాన్ని ప్రముఖ పర్వతారోహకుడు విశ్లావత్ బన్నీ విజయవంతంగా అధిరోహించారు.కామారెడ్డి పట్టణంలోనీ తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థి విస్లావత్ బన్నీ లడఖ్ ప్రాంతం లోని 6100 మీటర్లు ఎత్తైనా కైగర్ రి పర్వతంను అధిరోహించాడు.బన్నీ జూన్ నెల 14వ తేదీ నా పర్వతం ను ఎక్కడం ప్రారంభించి జూన్ నెల 19వ తేదీ ఉదయం 8:00 సమయంలో చెరుకున్నాడు. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటూ ఆయన ఈ సాహసయాత్రను విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. ఈ అరుదైన విజయంతో పర్వతారోహణ రంగంలో మరో మైలురాయిని నెలకొల్పిన బన్నీ, తన ఎదుగుదలకు వెన్నుదన్నుగా నిలిచిన తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి పట్ల గల గౌరవం, కృతజ్ఞతకు గుర్తుగా శిఖరాగ్రంపై ప్రత్యేక పతాకాన్ని ఎగురవేశారు.
  • నిజమైన నాయకత్వం అనేది కేవలం వ్యక్తిగత విజయాలకే పరిమితం కాకుండా, మరెందరికో స్ఫూర్తినివ్వడమేనని ఆయన ఈ చర్య ద్వారా చాటిచెప్పారు. మంచు పర్వతాల ఎత్తులపై రెపరెపలాడిన ఆ పతాకం కృతజ్ఞత, అంకితభావం, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భంగా విశ్లావత్ బన్నీ సాధించిన ఈ విశిష్ట విజయాన్ని పలువురు అభినందిస్తూ, ఆయన సాహసోపేత ప్రయాణం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -