Sunday, June 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐదేండ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించండి

ఐదేండ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించండి

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
ఐదేండ్లలోపు పిల్లలందరికీ తలిదండ్రులు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని అంతాపుర్ గ్రామ సర్పంచ్ పార్వతి పిలుపునిచ్చారు. ఆదివారం గ్రామంలో పోలయో చుక్కల కార్యక్రమాన్ని సర్పంచ్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నిండు జీవితానికి రెండు చుక్కలు ఎంతో ముఖ్యమని అన్నారు. పిల్లలకు పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దామని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంగీత అఖిల్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దత్తు, ఆశ వర్కర్ పద్మ, అంగన్వాడీ టీచర్ రేఖ, చిన్నారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -