Sunday, June 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి

ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి

- Advertisement -

బీర్కూర్ గ్రామ సర్పంచ్ ధర్మతేజ, వైద్యాధికారిణి డాక్టర్ శ్రీలేఖ
నవతెలంగాణ-బీర్కూర్ (నసురుల్లాబాద్) 

పల్స్ పోలియో కార్యక్రమాన్ని బీర్కూర్ గ్రామ సర్పంచ్ ధర్మతేజ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ శ్రీలేఖ ఆదివారం ప్రారంభించారు. బీర్కూర్ మండలంలోని పల్స్ పోలియో కేంద్రాలను వారు సందర్శించి కార్యక్రమం అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.

డాక్టర్ శ్రీలేఖ మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు.

ప్రతి అంగన్‌వాడీ కేంద్రం, ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమానికి తమ పిల్లలను తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -