- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని చౌట్ పల్లి గ్రామంలో గల కోటి లింగేశ్వర స్వామి ఆలయంలో సన్నిధానం షెడ్డు నిర్మాణం కోసం గ్రామానికి చెందిన గురుమంచి చంద్రశేఖర్ శర్మ దంపతులు మంగళవారం రూ.40వేల116 విరాళంగా అందజేశారు. కార్తీకమాస బ్రహ్మరథోత్సవాలు, జాతర సందర్భంగా శివ సుబ్రమణ్య దీక్ష స్వాముల సన్నిధానం షెడ్డు నిర్మాణానికి గురుమంచి చంద్రశేఖర్ శర్మ దంపతులు ఈ విరాళం మొత్తాన్ని అందజేశారు. సన్నిధానం షెడ్డు నిర్మాణం కోసం రూ.40వేల116 విరాళంగా అందజేసిన గురుమంచి చంద్రశేఖర్ శర్మ దంపతులకు కోటి లింగేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త, అర్చకులు భువన గంగాప్రసాద్ దీక్షితులు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -