- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఆన్సాన్పల్లి గ్రామానికి చెందిన ఆకునూరి రవిందర్ అనే రైతుకు చెందిన పాడి ఆవు విద్యుత్ షాక్ తో మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఆవు యజమాని పూర్తి కథనం ప్రకారం.. రోజులాగే మంగళవారం ఉదయం మేతకు విడిచిపెట్టాడు. సాయంత్రం అయిన ఇంటికి రాకపోవడంతో వెతుకుతున్న నేపథ్యంలో రాత్రి ఉరి చివర ఉన్న ట్రాన్స్ పార్మర్ సపోర్ట్ తిగ విద్యుత్ షాక్ గురై మృతిచెందినట్లుగా కన్నీరుమున్నీరైయ్యాడు. ఆర్థికంగా ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు ఆదుకోవాలని వేడుకున్నాడు.
- Advertisement -



