నవతెలంగాణ-జన్నారం
భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం (Special Intensive Revision – SIR)లో భాగంగా జన్నారం మండలంలోని మురిమడుగు పోలింగ్ స్టేషన్ను శుక్రవారం ఉట్నూర్ ఆర్‌డీఓ కార్యాలయ పరిపాలనా అధికారి సబ్బా రమేష్ సందర్శించారు.
ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారి (BLO)ల ద్వారా ఇంటింటికి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను పరిశీలించి, కార్యక్రమం పారదర్శకంగా, సమర్థవంతంగా మరియు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి అర్హుడైన ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జన్నారం తహసీల్దార్, బక్కయ్య మండల గిర్దావర్, వెంకటేశం బూత్ లెవల్ అధికారులు (BLOలు), మొర్రిగూడ గ్రామ పాలన అధికారి మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.



