– వైద్యాధికారిణి డాక్టర్ స్పందన
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ఈనెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్యాధికారిని డాక్టర్ స్పందన కోరారు. శుక్రవారం ఆమె మండలంలోని చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల గ్రామాలలో కేంద్రాలను ఏర్పాటు చేసి పుట్టిన నుండి ఐదు సంవత్సరాలలో పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయిస్తామని తెలిపారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు అన్నింటిని ఇప్పటికే పూర్తి చేసినట్లు వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 27 పోలియో చుక్కల కేంద్రాలు, ఒక ట్రాన్సిట్ మోర్తాడ్ బస్టాండ్ లో ఏర్పాటు చేస్తున్నామన్నారు.
అదేవిధంగా మూడు సూపర్వైజర్ బృందాలు, ఒక మొబైల్ బృందం ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ఆదివారం రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తామన్నారు. ఆరోజు హాజరు కాని పిల్లలకు సోమవారం రోజు ఇంటింటికి తిరిగి మా సిబ్బంది పోలియో చుక్కలు వేస్తారని డాక్టర్ స్పందన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, వాలంటీర్లు పాల్గొని చిన్నారులకు చుక్కల మందును వేస్తారన్నారు. మండలంలోని ప్రజలందరూ ఆదివారం రోజు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని, తద్వారా శిశు పక్షవాతాన్ని నివారించవచ్చునని ఆమె తెలియజేశారు.



