Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అయ్యయ్యో వైన్స్ లాటరీ పోయెనే..

అయ్యయ్యో వైన్స్ లాటరీ పోయెనే..

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు
ఈనెల వైన్స్ లు లాటరీ తీసే 27వ తేదీన వైన్స్ రానివారు అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే….అయ్యయ్యో జేబులు కాలి ఆయనే…ఈ పాట పాడుకుంటూ ఇంటికి వెళ్ళాక ఈ పాటని వైన్స్ వేసే వారికి షేర్ చేస్తే బాగుంటుంది. నలుగురు మిత్రులు వైన్స్ వేసే ముందు నవ్వుకుంటూ రాకుంటే తమ పరిస్థితి ఏమిటని  నవ  తెలంగాణ దృష్టికి వచ్చింది మళ్లీ వచ్చే వైన్స్ లాటరీలో పాల్గొనకుండా ఉండడానికి గుణపాఠం అవుతుంది. 

ప్రభుత్వం తెచ్చిన లాటరీ విధానం ద్వారా నూరు టెండర్లకు ముగ్గురికి మాత్రమే వస్తాయి 2647 టెండర్లు దాఖలు అయ్యాయి.అక్టోబర్ 18 నాటికి అంటే 82 షాపులకు సగటున ఒక్క షాపుకు 32 చొప్పున పడ్డాయి. అయినా ప్రభుత్వం తక్కువ టెండర్లు వచ్చాయని మళ్లీ ఐదు రోజులు గడువు ఇవ్వడం వైన్స్ జూదం పట్ల మరింత ప్రజల్లో ఆశ పెంచడమే అవుతుంది.లాటరీ విధానం వల్ల 100 టెండర్లకు ముగ్గురికి మాత్రమే అదృష్టం వరిస్తుంది.97 మందికి  షాపులను దక్కగా బాధతో ఇంటికి వెళ్లడం తప్ప గత్యంతరం లేని పరిస్థితిలో ప్రభుత్వ  విధానం ఉంది పాల్గొని అదృష్టం పరీక్షించుకునే కంటే ప్రభుత్వం తెచ్చిన జీవితం కంటే ఇంకా బయట అనేక జూదపు ఆటలు ఉన్నాయి అవి దీనికన్నా క్రికెట్ బెట్టింగ్  నయం కాసినో  పేకాట కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది.

క్రికెట్లో ఏ ఆటగాడు ఫామ్ లో ఉన్నాడు ఈ ఆటగాడు వికెట్లు తీస్తాడు లేదా కొంత ఆలోచించి బెట్టు చేస్తే 70% గెస్ చేయగలుగుతాం. సంత తెలివికి పదులు పెట్టి ఆడి ఓడిపోయిన సంతృప్తిని ఇస్తుంది. ఇది అంతకన్నా దారుణం  వైన్స్ టెండర్లలో అలా లేదు అదృష్టం పై ఆధారపడి ఉంటుంది. 30 ఏళ్ల కింద భాగ్యలక్ష్మి లాటరి టికెట్ ఇలానే ఉండేది ఈ లాటరీ విధానం నచ్చక ప్రభుత్వం ప్రజలు చెడిపోతున్నారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రద్దు చేశారు. కానీ అదే విధానం మద్యం షాప్ లో కొనసాగించడం ఎందుకు ఖజానా నింపుకోవడానికి ప్రజలు  తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వైన్స్ ఆట కంటే గోవా కెళ్ళి క్యాషినో  కనీసం 12 గంటల కాలక్షేపం వస్తుంది. మందు తిండి ఫ్రీ అందులో ఆటలు ఆడితే పేకాట ఇతర ఆటలు ఆడిన 3 లక్షలు పోవాలంటే కనీసం ఒక రోజున పడుతుంది కానీ ఈ లాటరీ కేవలం 30 నిమిషాలు ముగుస్తుంది.మూడు లక్షలు వదులుకోవాల్సిందే కొందరైతే పది టెండర్లు వేస్తే 30 లక్షలు లక్షలు సమర్పించుకోవాల్సిందే 

పది వేసిన వారికి ఒక షాపు వస్తే కేవలం 60 లక్షలు మాత్రమే మిగులుతాయి. 30 లక్షల డిడి లవి 10 లక్షలు వడ్డీలకు మిగిలేది 60 లక్షలు శ్రమ తో పాటు పెద్ద పెట్టుబడి అది కూడా రెండేళ్లు మాత్రమే రాను రాను ఇది పద్ధతి ఉంటే టెండర్లు వేయడం తగ్గుముఖం పడతాయి పోయినసారి కంటే ఇప్పుడు తక్కువ పడడం అది సూచిస్తుంది. నాలుగు సంవత్సరాల కిందట  21 నుండి 23 నవంబర్ 30 వరకు నూతన విధానం కెసిఆర్ తెచ్చారు. మొదటి సంవత్సరం కోటి రూపాయలు ఒక షాపు ఆదాయం వచ్చిందని ప్రచారం జరగడ తో 23 నుండి25 నవంబర్ 30 వరకు ఉండే వయసులో టెండర్లు పాల్గొనేవారు ఎక్కువ  సంఖ్యలో టోకెన్ వేశారు. అయితే ఈసారి షాపు వచ్చినవారు 10,15 టోకెన్లు వేసిన వారే ఎక్కువ షాపుల్లో ఉన్నారు. 10 అది టోకెన్లకు ఒక షాపు అంటే ఆదాయం తగ్గింది ప్రస్తుతం 25 నుండి27 నవంబర్ 30 వరకు టోకెన్లు తగ్గాయి  కానీ రెండు లక్షలని మూడు లక్షలు చేయడంతో గతంలో కంటే ఆదాయం ఏమి తగ్గకుండా కొద్ది మోతాదుగా పెరిగింది అదే  గతం కంటే ఏమి తగ్గనట్టు కనబడుతుంది. 

గతంలో టెండర్ చార్జి తక్కువ ఉండడం వల్ల పది వేసిన వారికి గతంలో 20 లక్షలు పోయాయి ఇప్పుడు 30 లక్షలు వెళుతున్నాయి. షాపు వస్తే వడ్డీ 10 లక్షలు ఖర్చు 5 లక్షలు అంటే ఒక షాపుతో కోటి రూపాయలు వస్తే మిగిలేది 55 లక్షలు మాత్రమే 55 లక్షలు 10 డిడి ల వారు పంచుకుంటే ఐదు లక్షల 50 వేల రూపాయలు ఒక్కరికి రెండు సంవత్సరాలు పేరు మీద వచ్చేది అంటే 3 లక్షలు పెడితే 5 లక్షల 50 వేలు వస్తాయి దీనికన్నా భాగ్యలక్ష్మి లాంటి టికెట్ కొంటే ₹100 పెడితే కోటి రూపాయలు కూడా రావచ్చు 50 లక్షలు 20 లక్షలు 1, 50 వేలు 10000 2000 వెయ్యిలు ఇలా వేళలో బహుమతుల అనేక చిన్న చిన్న బహుమతులు కూడా ఉంటాయి.కేవలం వంద రూపాయలు రోజు వంద రూపాయలు చొప్పున భాగ్యలక్ష్మి టికెట్ కొన్న 3 వేల రోజులు అంటే తొమ్మిది సంవత్సరాలు రోజు ఆడొచ్చు ఒక్కరోజులో తగిలితే తగలొచ్చు క్రికెట్లో చివరి బంతి సిక్స్ కొడతారని బెట్టు  కడితే 5000 వస్తాయి వెయ్యికి ఏ టీఎం గెలుస్తుందో బెట్ కాస్తే వెయ్యికి 200 0 క్రికెట్ అయినా పీకాటయినా కొంత ఆలోచించి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.

భాగ్యలక్ష్మి టికెట్ లాగా వైన్స్ కేటాయింపులు ఉన్నాయి కానీ మూడు లక్షలు పోవాలంటే భాగ్యలక్ష్మి లాటరీలో 9 సంవత్సరాలు పడుతుంది.వైన్స్ అయితే ఒకే రోజు దీన్నిబట్టి ప్రభుత్వం వైన్స్ వేస్తున్న వారికి ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది. రాను రాను టెండర్లు పాల్గొనే వారి సంఖ్య తగ్గుముఖం పడుతుంది. తిరుపతిలో యాదగిరిగుట్టలో నిలువు దోపిడీ ఇస్తే పుణ్యం అన్న దక్కుతుంది గుండు గీయించుకుంటే ఫ్రీగ తల నీలాలు సమర్పించొచ్చు.దేవుడికి వైన్స్ కు మాత్రం డబ్బులు మరి లక్షల్లో టెండర్లు పాల్గొని హుండీలో వేసి తిరు క్షవరం చేసుకోవాల్సిందేనని ప్రస్తుతo టెండర్ల పాల్గొనే  వ్యాపారులు చలోక్తిగా అనుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -