- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో గురువారం గ్రామ సంఘల సెర్ఫ్ హెచ్ 1 అంతర్గత ఆడిట్ నిర్వహించడం జరిగిందని ఎపిఎం సాయిలు తెలిపారు. గ్రామ సంఘాల అభివృద్ధి, రికార్డులు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. రుణాలు సకాలంలో చెల్లించి సంఘాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో సి బి ఓ ఆడిటర్ కుమార్, మండల సమైక్య అధ్యక్షులు రాజమణి, సీసీలు, వివోఏలు, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
- Advertisement -