- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం అమ్మ ఒడి కార్యక్రమాన్ని మెడికల్ అధికారి దివ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు రక్త పరీక్షలు నిర్వహించి సూచనలు, సలహాలు అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగే విధంగా గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ వెంకటరమణ, ల్యాబ్ టెక్నీషియన్ వనశ్రీ, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
- Advertisement -