- Advertisement -
న్యూఢిల్లీ : మోసపూరిత లావాదేవీలను అడ్డుకునేందుకు, ప్రమాదకర పేమెంట్స్‌ను ముందే పసిగట్టి హెచ్చరించేలా ఫోన్‌పే ప్రొటెక్ట్‌ను ప్రారంభించినట్లు ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే ఓ ప్రకటనలో పేర్కొంది. మోసపూరిత లావాదేవీల నుండి తన వినియోగదారులను రక్షించడానికి దీన్ని ప్రారంభించామని ఆ కంపెనీ ప్రతినిధి అనుజ్ భన్సాలీ పేర్కొన్నారు. ఈ ఫీచర్, అనుమానాస్పద నంబర్లకు పేమెంట్స్ చేయవద్దని, అటువంటి లావాదేవీలకు ప్రయత్నించే వారికి ‘ఫోన్‌పే ప్రొటెక్ట్’ హెచ్చరికను చూపిస్తుందన్నారు.
- Advertisement -

                                    

