సేవా సంస్థలకు వాహనాల అందజేత
నవతెలంగాణ- హైదరాబాద్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హైదరాబాద్ సర్కిల్ తన 71వ బ్యాంక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఏడు దశాబ్దాల సుదీర్ఘ నమ్మకం, ఆర్థిక సేవలు, దేశ నిర్మాణంలో తనదైన ముద్ర వేసిన బ్యాంక్ ఈ మైలురాయిని పురస్కరించుకుని సామాజిక బాధ్యతతో కూడిన సేవా కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమానికి ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) నీలేష్ ద్వివేది అధ్యక్షత వహించగా.. జనరల్ మేనేజర్లు సతీష్ కుమార్, రణవిజయ్ ప్రతాప్, ఆర్. గణేష్‌లతో పాటు బ్యాంక్ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డీజీఎం అండ్ సిడిఓ సురజిత్ త్రిపాఠి పర్యవేక్షణలో పర్యావరణహిత మొక్కలతో అతిథులకు స్వాగతం పలికి.. అనంతరం అందరూ కలిసి 71వ బ్యాంక్ డే ప్రతిజ్ఞ చేశారు.కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)లో భాగంగా ఎస్బీఐ స్థానిక విద్యా, సేవా సంస్థలకు మూడు వాహనాలను అందజేసి మరోమారు తన ఉదారతను చాటుకుంది. సికింద్రాబాద్‌లోని సాధన ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్ కు ప్రత్యేక మినీవ్యాన్‌ను, దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌కు 52 సీట్ల సామర్థ్యం కలిగిన బస్సును బ్యాంక్ అధికారులు అందజేశారు.
హైదరాబాద్‌లో ఎస్బీఐ 71వ బ్యాంక్ డే వేడుకలు
- Advertisement -
- Advertisement -



