- Advertisement -
నవతెలంగాణ – తలకొండపల్లి
మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ సిఎల్ శ్రీనివాస్ యాదవ్ మంగళవారం హైదరాబాద్ లోని వారి స్వగృహానికి వెళ్లి సత్య నారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. హరీష్ రావు తోపాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఈ కార్యక్రమంలోని మాజీ సర్పంచులు కేంచ హైమావతి రమేష్, జోలం జయమ్మ వెంకటయ్య, గుండ్రాతి నాగమణి లింగంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



