నిరుపయోగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం

– తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవలు
– అని కస్టమర్ల ఆసక్తి
– నెట్‌వర్క్‌ అందక బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్ల అవస్థలు
– భారంగా మారుతున్న ఇతర నెట్‌వర్కులు
నవతెలంగాణ-మర్పల్లి
ప్రజలకు మొట్టమొదటిసారిగా కొన్నేళ్లపాటు ఫోన్‌ నెట్‌వర్క్‌ సేవలు అందించిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రభుత్వ సంస్థ ప్రజల మన్ననలు పొందింది. తక్కువ ఖర్చుతో దేశ ప్రజలకు సౌకర్యవంతమైన నెట్‌వర్క్‌ సేవలను అందించిన ఘనత బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థదేనని ప్రజలు ఆ నెట్‌వర్క్‌ పట్ల ఆసక్తి చూపేవారు. ఇతర సంస్థలు పుట్టుకు రావడంతో ప్రభుత్వాలు బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థను నిర్లక్ష్యం చేస్తూ ప్రయివేట్‌ సంస్థలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రభుత్వ సంస్థ సేవలను కాలానికి అనుగుణంగా విస్తరించకపోగా ప్రయివేట్‌ సంస్థలను ప్రోత్సహించడంతో కస్టమర్లకు అవస్థలు మొదలయ్యాయి. తక్కువ ఖర్చుతో బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలను పొందిన ప్రజలు ఆ నెట్‌వర్క్‌ సక్రమంగా అందకపోవటంతో తప్పనిసరిగా ఇతర నెట్‌వర్క్‌లోకి మారవలసి వస్తుందని వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన టవర్‌ సుమారు15 కిలోమీటర్ల వరకు సిగల్స్‌ అందివ్వాల్సి ఉంటుందని ప్రస్తుతం 1 కిలోమీటర్‌ కూడా అందడం లేదని ఆరోపణలున్నాయి. దీంతో వందలాదిమంది బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు భారమైనా ఇతర నెట్‌వర్కుల్లోకి మారుతున్నా మని అంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి భవనాలు టవర్లు ఏర్పాటు చేసి కొన్నేండ్లుగా సేవలందించకుండా ఆభవనం నిరుపయోగంగా మారింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవలందించే బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలను ప్రజలకు ఉపయోగకరంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌లో తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవలు లభిస్తాయని ఆఫర్లను పరి శీలించి నేను గత ఆగస్ట్‌ నెలలో రిలయన్స్‌ నెట్‌వర్క్‌ నుండి బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ లోకి మారాను. సామాన్య ప్రజలకు ఆఫర్లు చాలా సౌకర్యవంతంగా ఉన్నా నెట్‌ వర్క్‌ అందడంలో సమస్యలున్నాయి. వారం రోజుల కింద వికారాబాద్‌ జిల్లా బీ ఎస్‌ఎన్‌ఎల్‌ అధికారికి సమస్యను వివరించగా మర్పల్లి మండల కేంద్రంలో ఉన్న టవర్‌కు 3 ఆంటీనాలలో కేవలం ఒకటి మాత్రమే పనిచేస్తుందని అందుకే సేవలు అందడం లేదని ఆ అధికారి ద్వారా సమాచారం తెలిపాడని వెంకటేశం తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలను వెంటనే విస్తరింపజేసి రూ.439 రోజు 2 జీబీ 90 రోజులు, రూ.347, 54 రోజులు రోజు 2 జీబీ రూ.788 180 రోజులు, రూ.2999కు రోజులు, రూ.997కు ఎస్‌టీడీఐఎస్‌డీ సేవలు 160 రోజులు, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్ల ను ప్రజలకు అందు బాటులో తేవాలని ఆయన కోరారు.
– కే వెంకటేశం

Spread the love