- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ..మహిళలకు ప్రభుత్వమిచ్చిన గౌరవమని యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు బొయిని ప్రశాంత్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని గుగ్గీళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రభుత్వం అందజేసిన ఇందిరా మహిళా శక్తి చీరలను పలువురి మహిళలకు ప్రశాంత్ ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి పంపిణీ చేశారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు జంగిలి మల్లయ్య, ర్యాకం కనకయ్య,గ్రామాధ్యక్షులు తిప్పరవేణి బాబు, గ్రామ వీఓఏ భాగ్య, మహిళలు పాల్గొన్నారు.
- Advertisement -



