Thursday, November 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్  కు సన్మానం  

 ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్  కు సన్మానం  

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్ :  ఈ ఆర్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను గుర్తించి నందిపేట మండలం బద్గుణ, ఐలాపూర్ గ్రామాలకు చెందిన డాక్టర్ నరసయ్య, నరేష్ లు    గురువారం పట్టణంలోని శ్రీరామ కాలనీ ఈ ఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో కలుసుకున్నారు. ఫౌండేషన్ ద్వారా చేస్తున్న పలు సేవ కార్యక్రమాలను గుర్తించి వారిని అభినందించారు. అనంతరం ఆయనకు పూలమాలవేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బీసీలు రాజ్యాధికార దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీసీ సామాజిక  వర్గాన్ని బలోపేతం చేయడంలో నందిపేట మండలంలో తమ వంతు మద్దతు ఉంటుందన్నారు.  రాబోయే రోజులలో రాజశేఖర్, రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజలకు మరెన్నో సేవలు చేయాలని  ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఎగ్స్ ట్రేడర్, షా రిక్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -