నవతెలంగాణ- డిండి: డిండి మండలం బ్రాహ్మణపల్లి తండ మాజీ సర్పంచ్ ముడావత్ కృష్ణముర్తి బార్య శాంతాబాయి మృతి బాధాకరమని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం డిండి మండలం బ్రాహ్మణపల్లి తండాలో ఆమె దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి మనోదైర్యాని నింపారు. ఈ కార్యక్రమంలోబీ బీఆర్ఎస్ నాయకులు కేతావత్ బిల్యా నాయక్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ పేర్వాల జంగ రెడ్డి, కొండమల్లెపల్లి మండల పార్టీ అధ్యక్షులు రమావత్ దస్రు నాయక్, దొంతినేని భగవంత్ రావు, యువజన విభాగం మండల అధ్యక్షుడు మల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, జీవన్ తదితరులు పాల్గొన్నారు.