- కాశవారి గూడెం బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బొల్లం వెంకన్న..
నవతెలంగాణ-మునుగోడు: నూతనంగా ఏర్పడిన కాశవారి గూడెం లో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు తమను ఆశీర్వదించాలని కాశవారి గూడెం బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బొల్లం వెంకన్న గ్రామ ప్రజలను కోరారు. ఆదివారం ఆ గ్రామంలోని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు గ్రామంలోని ప్రజలందరూ తమ ను గెలిపించేందుకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డ్ అభ్యర్థి షేక్ హుస్సేన్, 2వ వార్డ్ అభ్యర్థి షేక్ జాకీర్ , 3వ అభ్యర్థి వార్డ్ షేక్ నాగుల్ మీరా, 5వ వార్డ్ బొల్లం శ్రీకాంత్, కార్యకర్తలు నవీన్ పాషా, జావీద్,ముక్తిన్, హైమత్, రఫీల్, హుస్సేన్, అబ్దుల్ రహీమ్, మదర్ సబ్. కమల్ సబ్, రహీమ్ పాషా, లతీఫ్, జానీ,అబ్దుల్ ఫరిన, సైదా సబ్, కరీం, నాగ, ఐనుద్దీన్, యాకుబ్, కాశీమ్, షేపిర్ తదితరులున్నారు.



