Monday, May 19, 2025
Homeతెలంగాణ రౌండప్మాల మహానాడు ఆరోపణలు సరికావు..

మాల మహానాడు ఆరోపణలు సరికావు..

- Advertisement -

తెలంగాణ నేతకాని మహర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సేగ్గం రాజేష్..
నవతెలంగాణ – మల్హర్ రావు
: సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణకి దేవదాయశాఖ అధికారులు ఆహ్వాన పత్రిక అందజేసినట్లుగా,పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో  పెద్దన్న పాత్ర పోషించి మంథని నియోజకవర్గం నుండి 53,000 వెయ్యిల మెజారిటీ అందించిన రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబుదని తెలంగాణ నేతకాని మహార్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సేగ్గెం రాజేష్ అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళితుల్లో మంథని  నియోజకవర్గంలో అత్యధికంగా మాదిగ , నేతకాని  కులాలు ఉన్నప్పటికీ  కూడా రాజకీయంగా మాల సామాజిక వర్గానికి మంథని నుండి మహా ముత్తారం వరకు పెద్ద పీట వేసిన ఘనత రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుదన్నారు. మంథని నియోజకవర్గంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో అనేక దళితుల హత్యలు జరిగినప్పుడు  స్పందించని చేన్నయ్య శ్రీధర్ బాబు దళితులను చిన్నచూపు చూస్తున్నాడని విమర్శించడం సిగ్గుచేటన్నారు. కేవలం రాజకీయా లబ్ధి కోసమే రిజర్వేషన్ నియోజకవర్గలలో దళితులమని చెప్పుకునే వివేక్ కుటుంబం పార్లమెంట్ ఎన్నికల ప్రచార భాగంలో మాహముత్తారం మహిళా మండల అధ్యక్షురాలు కీర్తి బాయ్ రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆమె కుటుంబానికి ఏం న్యాయం చేశారో చెన్నయ్య చెప్పాలని ప్రశ్నించారు. దేవాదాయ శాఖ కమిషనర్ శైలజ రామయ్యను రాజీనామా చేయాలని విమర్శించడం  అవగాహన రాహిత్యమన్నారు. ప్రోటోకాల్ బాధ్యత గాడ్ విభాగందని, వంశీకృష్ణ కుటుంబం మెప్పుపొందడం కోసం మరొక్కసారి రాష్ట్ర ఐటీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు, దేవదాయా కమిషనర్ శైలజపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తస్మాత్  జాగ్రత్త హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నేతకానీ సంఘం మహాదేవపూర్ మండల యూత్ అధ్యక్షులు కొండగొర్ల సంతోష్, పూతల శ్యామ్ సుంధర్, జాడి రాజసడవలి, పూతల దుర్గయ్య, గాలి నరేష్, పూతల సడువలి, గోమాస రాజబాపు, జాడి జనార్దన్, పూతల బానేష్, పూతల నవీన్, ప్రవీణ్, కిషన్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -