క్రీడలు నిర్వహించడం అభినందనీయం

– మంచాల సీఐ కాశీ విశ్వనాథ్‌, నోముల సర్పంచ్‌ పల్లాటి బాల్‌రాజ్‌
నవతెలంగాణ-మంచాల
మండల పరిధిలోని నోముల గ్రామంలో దసరా పండుగ సందర్భంగా బీఆర్‌ఎస్‌ యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శి గంట విజరు యువకులకు క్రికెట్‌ క్రీడోత్సవాలు నిర్వహించడం అభినదనీయమని మంచాల సీఐ కాశీ విశ్వనాథ్‌, నోముల సర్పంచ్‌ పల్లాటి బాల్‌రాజ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ గ్రామాధ్యక్ష, కార్యదర్శులు బత్తుల కరుణాకర్‌ రెడ్డి, గంట హనుమంతు, నాయకులు పల్లాటి శ్రీనివాస్‌, కిరణ్‌ కుమార్‌, పోలమొని మహేష్‌ యాదవ్‌, విష్ణుయాదవ్‌, మంగలారం నాగరాజు, పల్లాటి ప్రశాంత్‌, గ్రామ క్రీడాకారులు తదితరులు ఉన్నారు.

Spread the love