- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
బ్యాంకులతో ప్రజల సొమ్ముకు భద్రత ఉంటుందని దండేపల్లి అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్ వేల్పుల రవీందర్ అన్నారు. మంగళవారం జన్నారం మండలంలోని తిమ్మాపూర్ వివో లీడర్లకు, మహిళలకు బ్యాంకు లావాదేవీలపై అవగాహన కల్పించారు. బ్యాంకుల ద్వారా ప్రజలకు పొదుపు, ఇన్సూరెన్స్, వాహనం, వ్యవసాయ రుణాలు అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ రహిత లావాదేవీలపై ఆసక్తిని పెంచుకోవాలని ఆయన కోరారు. వివో గ్రూప్ సభ్యులు మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



