కులం, మతం పేరిట బీజేపీ నయవంచన : ఖర్గే

రారుపూర్‌ : కులం, మతం పేరుతో ప్రజలను బీజేపీ మభ్యపెడుతున్నదని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సుక్మాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఖర్గే మాట్లాడుతూ కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు. దేశం కోసం త్యాగాలు చేసిన కాంగ్రెస్‌ను విమర్శించడమే బీజేపీ పనిగా పెట్టుకుందని ఎద్దేవా చేశారు.

Spread the love